విజయ్ దేవరకొండ అంటే సంచలనం. సంచలనం అంటే విజయ్ దేవరకొండ అన్నట్లుగా మారింది పరిస్థితి. తాజాగా మన రౌడీ బాస్ ఇంకోసారి అందరి దృష్టినీ ఆకర్షించి, స్పెషల్‌గా చర్చల్లో నిలిచాడు. మనోడు ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదలవుతోన్న ఆడియో సింగిల్స్‌లో మొదటి ఆడియో సింగిల్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక రెండో ఆడియో సింగిల్ రేపు అనగా మే 12న విడుదల కానుంది. ఇందులో కొత్తేముంది.? అనుకుంటున్నారా.? ఏ కొత్తదనం లేని దానికి కూడా ఏదో కొత్తదనం ఆపాదించడమే మనోడి ఇస్టైల్. అదే చేశాడు. ఈ పాటను ఇంకా విడుదల కాకుండానే సాంగ్ ఆఫ్ ది ఇయర్ అని ప్రకటించేశాడు విజయ్ దేవరకొండ. ఇదే ఇప్పుడు చర్చలకు కారణమైంది. రిలీజ్ చేయడమే వారి వంతు. రిజల్ట్ తేల్చాల్సింది ఆడియన్స్ వంతు. కానీ ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే విజయ్ దేవరకొండ ఇంకా రిలీజ్ కాని సాంగ్‌ని స్వయంగా 'సాంగ్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించేస్తాడు చెప్పండి.
అదే మనోడి గట్స్. ఇంతవరకూ విడుదలైన విజయ్ దేవరకొండ సినిమాల్లోని మ్యూజిక్ కూడా సూపర్ హిట్‌గానే చెప్పొచ్చు. మనోడికి మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. అందులో నో డౌట్. అయితే ఇదే మరీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్‌లా ఉందంటూ భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. 'గీత గోవిందం'తో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మికా రెండోసారి విజయ్‌తో జోడీ కడుతోంది ఈ సినిమాలో. భరత్ కమ్మ ఈ సినిమాకి దర్శకుడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రూపొందుతోంది.