గ్లామ్‌షాట్‌: పూస పూసల అందం

By iQlikMovies - December 22, 2018 - 17:27 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ అందం గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. టాలీవుడ్‌ అందగాడు మహేష్‌ బాబునే ఈ ముద్దుగుమ్మ అందం డామినేట్‌ చేసేసింది. ఇక అంతటి అందాన్ని పొగడడం సాధ్యమా. అందం వేరు. ఆకర్షణ వేరు. ఏదో తెలియని ఆ అందమైన ఆకర్షణ కైరాలో దాగుంది. ఫ్రేము, ఫ్రేములోనూ ఈ ముద్దుగుమ్మ అందం గిలిగింతలు పుట్టిస్తుంటుంది. అన్నింటికీ మించి మాంచి ఫోటోజెనిక్‌ ఫేస్‌. కైరా అలా చూస్తే చాలు.

 

ఆ చూపులోనే పాలపుంతను మించిన బ్రైట్‌నెస్‌. ఇక స్టైల్‌ విషయానికి వస్తే అలా నిలబడితే చాలు దేవదారు శిల్పమే. నవ్విందా ముత్యాలు రాలు. తాజా పిక్‌ విషయానికి వస్తే ముత్యాలు పొదిగినట్లున్న ఈ టాప్‌లో కైరా అందాల్ని అద్దంలో చూస్తుంటే ముగ్ద మనోహరం అన్నట్లు లేదూ.. అంతేగా అంతేగా..! సంక్రాంతికి ఈ ముద్దుగుమ్మ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో కలిసి 'వినయ విధేయ రామ' సినిమాతో సందడి చేయనుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS