గ్లామ్‌ షాట్‌: దాచేసి.. హాటుగా దోచేసి.!

By iQlikMovies - December 14, 2018 - 18:13 PM IST

మరిన్ని వార్తలు

కొంచెం దాచేసి, ఇంకొంచెం చూపించేసి.. హాట్‌ హాట్‌గా కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసి.. వారి అభిమానాన్ని దోచేసి.. ఇంతలా హీటెక్కించేస్తే ఎలా.? 'పైసా వసూల్‌' బ్యూటీ కైరా దత్‌ గుర్తుంది కదా? ఆ బ్యూటీనే మీరిక్కడ చూస్తున్నది. అంతకు ముందు ఈ అందాల భామ తెలుగులో 'రేసుగుర్రం' సినిమాలోనూ ఐటమ్‌ సాంగ్‌ చేసింది. బాలయ్యతో 'పైసావసూల్‌' సినిమాలో పోలీస్‌ గెటప్‌లో కన్పించి,

 

హాట్‌ హాట్‌గా అందాల్ని వడ్డించేసిన కైరా దత్‌, మళ్ళీ అలాంటి హాట్‌ సాంగ్‌ కోసం ఎదురుచూస్తోందట. టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి పిలిచి మరీ అవకాశమిచ్చే ఆ దర్శకుడు ఎవరట.? ఓ సూపర్‌ హిట్టు, ఇంకో సూపర్‌ ప్లాప్‌ తెలుగులో ఈ బ్యూటీకి వున్నాయ్‌. హిట్టూ ఫట్టూ పక్కన పెడితే, వెండితెరపై హీటెక్కించేయడానికి తగినంత 'గ్లామర్‌' ఈమెలో వుందని ఈ ఫొటో చూసి ఒప్పుకోవాల్సిందే ఎవరైనా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS