ఈ 'ఖైదీ' గారు మ‌ళ్లొస్తార‌ట‌!

మరిన్ని వార్తలు

ఓ సినిమా హిట్ట‌యితే.. వెంట‌నే సీక్వెల్ చేయాల‌న్న ఆలోచ‌న పుట్టేస్తుంది. అయితే అన్ని క‌థ‌లూ సీక్వెల్‌కి ప‌నిచేయ‌వు. ఆ ద‌మ్ము, అర్హ‌త కొన్ని సినిమాల‌కే ఉంటుంది. స‌ద‌రు సినిమాకి సీక్వెల్ తీయాలంటే, దర్శ‌కుడు కూడా కాస్త ముంద‌స్తుగా ఆలోచించాల్సివుంటుంది. 'ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండొచ్చు' అనే హింట్ త‌న ముంద‌స్తు సినిమాలో ఎక్క‌డో ఓ చోట ఇచ్చి ఉండాలి.

 

చిత్ర‌సీమ‌లో ఇప్పుడు `ఖైదీ` సీక్వెల్ గురించిన టాపిక్ మొద‌లైంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉండే ఛాన్సులు నూటికి నూరుశాతం ఉన్నాయ‌న్నది ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. కార్తి న‌టించిన ఖైదీ ఈ శుక్ర‌వారం విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉండొచ్చ‌న్న హింట్‌.. సినిమా చివ‌ర్లో ఇచ్చేశాడు ద‌ర్శ‌కుడు. దిల్లీ పాత్ర‌కో ఫ్లాష్ బ్యాక్ ఉంద‌న్న సంగ‌తి చెప్ప‌క‌నే చెప్పాడు. ఈ సినిమాకి ఇప్పుడు మంచి టాక్ వ‌చ్చింది. కార్తి విజ‌య‌వంత‌మైన చిత్రాల జాబితాలో ఇది కూడా చేరిపోయింది.

 

తెలుగునాట కూడా మంచి వ‌సూళ్లు ద‌క్కుతున్నాయి. దాంతో ఖైదీ సీక్వెల్‌పై దృష్టి ప‌డింది. ద‌ర్శ‌కుడు క‌న‌క‌రాజ్ కూడా 'దిల్లీ మ‌ళ్లీ వ‌స్తాడు' అనే అర్థం వ‌చ్చేరీతిలో ట్వీట్ చేశారు. దాన్ని బ‌ట్టి చూస్తే ఈ సినిమాకి సీక్వెల్ త‌ప్ప‌కుండా ఉంటుంది. అయితే అంత‌కు ముందే 'ఖాకీ' సినిమాకి కూడా సీక్వెల్ చేస్తాన‌ని కార్తి మాటిచ్చాడు. ముందు ఖాకీ పూర్త‌య్యాకే.. ఈ ఖైదీ సీక్వెల్ మొద‌ల‌వ్వొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS