ఎప్పటికప్పుడే కెరీర్ అయిపోయిందనుకున్న తరుణంలో ఉవ్వెత్తున లేచే కెరటంలా ఎగిసి పడుతూ ఉంటుంది చందమామ కాజల్ అగర్వాల్. మళ్ళీ అదే పరిస్థితిలో వుంది కాజల్ ఇప్పుడు. ఇటీవల వరుసగా ఫెయిల్యూర్స్ చవి చూసిన కాజల్ అగర్వాల్ పని అయిపోయిందనుకున్నారంతా. అదే టైమ్‌లో కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ ఛాన్స్ దక్కించుకోవడం జరిగింది. యాక్సిడెంట్ కారణంగా ఈ సినిమా నిర్మాణం ప్రస్తుతం సందిగ్ధంలో పడినా, మరో ఆఫర్ కాజల్ కెరీర్‌కి బూస్టప్ ఇచ్చింది. అదే మెగాస్టార్‌తో ‘ఆచార్య’ మూవీ. ఈ సినిమా కాజల్ కెరీర్‌ని మళ్లీ రాకెట్ స్పీడుతో నడిపించేస్తోంది.
ఈ సినిమాతో పాటు, తమిళంలో మరో బంపర్ ఆఫర్ కాజల్‌కి చిక్కినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్‌తో కాజల్ ఓ సినిమాలో నటించబోతోందట. గతంలో కాజల్, విజయ్ జంటగా నటించిన ‘తుపాకి’ మూవీకి సీక్వెల్ రూపొందించానుకుంటున్నారన్న టాక్ బయటికి వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసే పనిలో ఉన్నాడట డైరెక్టర్ మురుగదాస్. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా విజయ్‌నీ, కాజల్ అగర్వాల్‌నే తీసుకోవాలనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే, కాజల్ కెరీర్ ఇప్పట్లో చూసుకోనక్కర్లేదిక.