ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ని ఇంకా కొందరు లైట్ తీసుకుంటున్నారు. విచ్చల విడిగా రోడ్లపైకి వస్తూ, నిస్వార్ధంగా చేస్తున్నపోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కరోనాని లైట్ తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండి, మన కుటుంబాన్ని, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందాం అని నినదించారు.
కరోనా కట్టడిలో తమ తమ ఆరోగ్యాన్నీ, కుటుంబాల్నీ పట్టించుకోకుండా, పోలీసులూ, డాక్టర్లు చేస్తున్న సేవల్ని ప్రశంసిస్తూ, వారికి సెల్యూట్ చేశారు. వారికి మనం చెల్లించే భారీ మూల్యం ఒక్కటే, వారిని కష్టపెట్టకుండా, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఇంట్లోనే ఉండడం. ప్రభుత్వాలు సూచించిన నియమాల్ని కఠినంగా పాఠించడం అని ఆయన ప్రజల్ని కోరారు. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శివకార్తికేయన్, ‘శక్తి’ సినిమాతో మరోసారి టాలీవుడ్‌ని పకరించేందుకు సిద్ధపడ్డాడు. కానీ, కరోనా కారణంగా ఆ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.