'క్వీన్‌' వేరు 'నేను' వేరు అంటున్న చందమామ

By iQlikMovies - June 08, 2018 - 12:43 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ 'క్వీన్‌' తమిళ రీమేక్‌లో చందమామ కాజల్‌ అగర్వాల్‌ క్వీన్‌ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 'ప్యారిస్‌ ప్యారిస్‌' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిన్నా చితకా మార్పులు చేసి, తమిళ నేటివిటీకి అనుగుణంగా తీర్చి దిద్దుతున్నారు. రమేష్‌ అరవింద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

కాగా ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్‌ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో 'క్వీన్‌' సినిమాకి సంబంధించిన కొన్ని ఆశక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకుంది. 'క్వీన్‌' రీమేక్‌లో నటించే అవకాశం దక్కినందుకు చాలా సంతోషించాను. నిజానికి కంగనా పాత్రను రీప్లేస్‌ చేయడం ఎవ్వరి వల్లా కాదు. అల్టిమేట్‌ స్థాయిలో కంగనా నటించేసింది. ఆ పాత్రలో ఆమెను ఎవ్వరూ రీప్లేస్‌ చేయలేం. కానీ ఆ పాత్ర తాలూకు ఆటిట్యూడ్‌ని మాత్రం ఆకళింపు చేసుకుని నటించేందుకు ప్రయత్నించాను అని కాజల్‌ చెప్పుకొచ్చింది.

 

వాస్తవానికి సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే సినిమా ఇది. మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఉంటుంది. కానీ ఈ పాత్ర ప్రభావం నిజజీవితంలో తనపై ప్రభావం చూపించదనీ కాజల్‌ అంటోంది. అంతేకాదు, పాత్ర చిత్రీకరణ విషయంలో బాలీవుడ్‌ క్వీన్‌తో పోలిస్తే, కోలీవుడ్‌ క్వీన్‌ పాత్ర కాస్త భిన్నంగా ఉంటుందట. అయితే మెయిన్‌ థీమ్‌పై ఎలాంటి ఇంపాక్ట్‌ లేకుండా మాతృకలోని సున్నితమైన అంశాలకు ఎలాంటి భంగం కలగకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. 

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తెలుగులో కాజల్‌, ఎన్టీఆర్‌తో 'అరవింత సమేత..' చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS