నేచురల్ స్టార్ నాని 'బిగ్‌బాస్ 2' హోస్ట్‌గా త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఈ షోలో పార్టిసిపేట్ చేయబోయే పలువురు సెలబ్రిటీస్ లిస్ట్ ఆల్రెడీ ప్రచారంలో ఉంది. వారిలో ముఖ్యంగా ఆశక్తికరమైన పార్టిసిపెంట్ నటి శ్రీరెడ్డి. ఈ మధ్య అసభ్యకరమైన ట్వీట్లు, అనుచితవ్యాఖ్యలతో దుమారం రేపిన శ్రీరెడ్డి పేరు 'బిగ్‌బాస్ 2' పార్టిసిపెంట్స్ లిస్టులో ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలో నిజమెంతుందో మరో రెండు రోజుల్లో తెలిసిపోనుంది.
ఇదిలా ఉంటే, మరోపక్క ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెడుతూనే ఉంది. ముఖ్యంగా నానిపై ఆమె ట్వీట్లు మానడం లేదు. మొన్న నానిని కామాంధుడిగా అభివర్ణించిన శ్రీరెడ్డి లేటెస్టుగా 'నాని కాపురంలో నిప్పులే' అంటోంది. 'నాని నేను కలిస్తే, డర్టీ పిక్చరే. కానీ ఎప్పుడు? త్వరలోనే నాని రాసలీలలు బయటపడతా..' అంటూ శ్రీరెడ్డి ట్విట్టర్‌లో చేసిన తాజా వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఒకవేళ 'బిగ్‌బాస్ 2' షోలో శ్రీరెడ్డి ఉంటే పరిస్థితి ఏంటట.? నాని ఏమో 'ఇంకొంచెం మసాలా బాబాయ్' అంటున్నాడు. ఆ 'మసాలా' అర్ధమేంటి? శ్రీరెడ్డి 'డర్టీ పిక్చర్' అంటోంది. దానర్ధమేంటి.? ఈ రకంగా శ్రీరెడ్డి మరోసారి పబ్లిసిటీ స్టంట్ చేస్తోందా? అంటే అవుననే అనిపిస్తోంది.
ఏది ఏమైనా మరో రెండు రోజుల్లోనే అంతా రివీల్ అయిపోతుంది. జూన్ 10 నుండి 'బిగ్‌బాస్ 2' బుల్లితెరపై ప్రసారం కానుంది. అప్పటితో ఇక ఎలాంటి గాసిప్స్‌కైనా తెర పడిపోవడం ఖాయం. లెట్స్ వెయిట్ అండ్ సీ.