కాజల్‌, బెల్లంకొండ 'కికి' రచ్చ అదిరింది!

By iQlikMovies - August 13, 2018 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య సెలబ్రిటీలు కికి ఛాలెంజ్‌ పేరిట సోషల్‌ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆదాశర్మ, రెజీనా తదితర ముద్దుగుమ్మలు ఈ కికి ఛాలెంజ్‌ని డిఫరెంట్‌గా ప్రమోట్‌ చేశారు. అయితే కాజల్‌ - బెల్లంకొండ శ్రీనివాస్‌ మాత్రం అందరి కన్నా విభిన్నంగా ఈ కికి ఛాలెంజ్‌కి మద్దతుగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. 

వీడియో అయితే సింప్లీ సూపర్బ్‌. వీల్‌ ఛెయిర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌, అతని పక్కనే హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూర్చొని ఉన్నారు. సడెన్‌గా వీల్‌ చైర్‌లోంచి దిగి వీరిద్దరూ స్టెప్పులేశారు. తలకి అక్కడక్కడా గాయాలు, వాటికి బ్యాండేజ్‌ వేసి ఉన్నాయి వీరిద్దరికీ. ఇంతకీ ఇదంతా ఎందుకంటారా? కికి ఛాలెంజ్‌ని ఎంకరేజ్‌ చేస్తే చివరికి వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యేది అని వీరిద్దరూ వినూత్నంగా సందేశమిచ్చారన్న మాట. 

ప్రస్తుతం ఈ ఇద్దరూ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. నడుస్తున్న వాహనంలోంచి దిగి డాన్స్‌ చేయడమే 'కికి' ఛాలెంజ్‌. దీన్ని అతి ప్రమాదకరమైన చర్యగా పోలీసులు అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటించాలనీ వారు మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎవరూ ఈ డేంజరస్‌ కికి ఛాలెంజ్‌కి దిగొద్దని కాజల్‌, బెల్లంకొండ ఈ వీడియో ద్వారా 'స్వీట్‌' వార్నింగ్‌ ఇచ్చారన్నమాట. ఈ వీడియో చూసిన కొందరు బెల్లంకొండ - కాజల్‌ని శభాష్‌ అనకుండా ఉండలేకపోతున్నారు. 

సోషల్‌ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS