ముద్దుగుమ్మ చందమామ మరో మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాజల్ ఫేడవుట్ అయిపోయిందనే టాక్ వచ్చింది. కానీ, కెరీర్ డల్ అయిన తరుణంలో ఉప్పెనలాంటి అవకాశాలు తన్నుకు రావడం కాజల్‌కి కొత్తేం కాదు. అలాంటి అవకాశమే మళ్లీ కాజల్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. కాజల్ పని పూర్తిగా అయిపోయిందనుకున్న టైమ్‌లో చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ’లో ఛాన్స్ దక్కింది. ఇక ఆ తర్వాత మళ్లీ కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మళ్లీ అదే సిట్యువేషన్‌ని ప్రస్తుతం ఎదుర్కొంటున్న వేళ కాజల్ లక్ మళ్లీ తిరగబడిరది. మెగాస్టార్ సినిమాలో కాజల్ అగర్వాల్ అని తాజాగా ప్రచారం తెరపైకి వచ్చింది.
త్రిష హీరోయిన్‌గా నటించాల్సిన ఆ ఛాన్స్, త్రిష వదులుకోవడంతో కాజల్‌కి తగిలింది. కాజల్‌ని దాదాపు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, మరికొంత కాలం కాజల్ ఇండస్ట్రీలో పాతుకుపోతుందన్నట్లే. చిరంజీవి సరసన ఎలాంటి హీరోయిన్ సెట్ అవుతుందనే విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. అయితే, ఆల్రెడీ చిరుతో కాజల్ జోడీ హిట్ అయ్యింది కాబట్టి, ఆడియన్స్‌కి కూడా ఈ జోడీపై ఎలాంటి అభ్యంతరాల్లేవ్. సో మెగాస్టార్‌తో కాజల్ అగర్వాల్ జోడీ మళ్లీ ఫిక్స్ అయినా డబుల్ ఓకే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘మోసగాళ్లు’ చిత్రంలో నటిస్తోంది. మంచు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.