అందాల చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్, ఆమె వయసుతో పోటీ పడ్తోందనడం అతిశయోక్తి కాదేమో. మామూలుగా అయితే, ఓ వయసొచ్చాక కెరీర్‌లో డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. కాజల్ అగర్వాల్ విషయంలో అలా కాదు. వయసు పెరుగుతున్నకొద్దీ ఆమెలో గ్లామర్ మరింత పెరిగిపోతోంది. స్టార్‌డమ్ విషయంలోనూ ఆమె గ్రాఫ్ అలా అలా పెరుగుతూనే వస్తోంది. తాజాగా, అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇదిగో ఇలా ఓ ఈవెంట్‌లో మెరిసింది. ఈ ఫొటో చూశాక, గ్లామర్ విషయంలో అందాల చందమామకి పోటీనే లేదని అనుకోవాల్సిందే ఎవరైనా. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌తోపాటు, కోలీవుడ్‌లోనూ బిజీగా వున్న కాజల్ అగర్వాల్, బాలీవుడ్ విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఆల్రెడీ ఓ సారి బాలీవుడ్‌ని పలకరించేసిన ఈ భామ, సౌత్‌లో బిజీగా వుండడంతో బాలీవుడ్‌కి టైమ్ కేటాయించలేకపోతున్నానని చెబుతోంది. ఎప్పుడూ హ్యాపీగా వుండడమే తన గ్లామర్ సీక్రెట్ అనీ, వయసుకీ గ్లామర్‌కీ సంబంధమే లేదని తేల్చసింది కాజల్ అగర్వాల్. నిజమే మరి.