#RRR కి సంబంధించిన తాజా సమాచారం మీకోసం...

మరిన్ని వార్తలు

బాహుబలి సిరీస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమాల పట్ల తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సినీప్రేక్షకుల దృష్టి కూడా పడింది అన్నది నిర్వివాదాంశం.

ఇక బాహుబలి తరువాత ఆయన చేస్తున్న చిత్రం- #RRR. ప్రస్తుతం ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అని సమాచారం. ఈ సమయంలో #RRRకి సంబంధించిన ఒక కీలక సమచారం తెలిసింది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి- #RRR కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలుకానుందట. ఇప్పటికే ఈ చిత్రంలో ఉండే పాటలకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయట, ఈ విషయమై కీరవాణి కుమారుడు నేపధ్య గాయకుడు అయిన కాల భైరవ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

అయితే ఈ చిత్ర షూటింగ్ ని మూడు షెడ్యూల్స్ పూర్తి చేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నారట. రామ్ చరణ్, ఎన్టీఆర్ & రాజమౌళి కలయికలో రానున్న ఈ చిత్రం కచ్చితంగా ఒక మైలురాయి చిత్రంగా నిలిచిపోనుంది అని కచ్చితంగా మాత్రం చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS