దశాబ్ధ కాలానికి పైగానే చందమామ బ్యూటీ కాజల్ తెలుగు ఇండస్ట్రీని రాణిలా ఏలుతూనే ఉంది. ఇంత కెరీర్‌లో ఎప్పుడూ చందమామ అందం కాసింతైనా తరిగిన సందర్భం లేదు. గ్లామర్‌లో ఎప్పుడూ గీతలు దాటలేదు. కానీ క్యూట్ హాట్‌నెస్‌కి కాజల్ కేరాఫ్ ఆడ్రస్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో కాజల్ పెద్దగా హాట్ పిక్స్ పోస్ట్ చేయదు. ఎప్పుడో అడపా దడపా కనిపిస్తుంటుంది అంతే. ట్రెండీగా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయించుకోవడంలో కాజల్‌ది ప్రత్యేకమైన టేస్ట్ అని చెప్పాలి. తాజాగా కాజల్ ఫోటో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ ఫోటోలో కాజల్ ఎంత ఫ్రెష్ అండ్ సెక్సీ అప్పియరెన్స్ ఇస్తుందో మీరు కూడా చూసి తీరాల్సిందే మరి. సీనియర్ తార అయినా కానీ, గ్లామర్‌లో ఈ ఫ్రెష్‌నెస్ కాజల్‌కి తప్ప మరెవరికీ సాధ్యం కాదనిపిస్తోంది కదా. అందుకే కాజల్‌ని చందమామ అని ముద్దుగా పిలుచుకుంటుంటాం. ప్రస్తుతం కాజల్ తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమాలోనూ, తమిళంలో 'క్వీన్' రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్'లోనూ నటిస్తోంది.