యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ కోసం ఏకంగా బాడీ పెంచేసి అందరికి ఒక షాక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాని అందరి అంచనాలని అందుకునేలా తీర్చిదిద్దుత్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్.
ఇదిలావుండగా ఈ సినిమాలో ఒక మంచి ఐటం సాంగ్ ప్లాన్ చేసినట్టు అందులో ఏకంగా ప్రముఖ హీరోయిన్లు అయిన తమన్నా, కాజల్ లు నర్తించబోతున్నారు అని ఒక వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు అని ఇప్పటివరకైతే ఎలాంటి ఐటం సాంగ్ ని పెట్టాలనుకోవడంలేదు అని సమాచారం.
దీనితో ఈ ఐటం సాంగ్ ఉంటుంది అంటూ ఆశపడ్డ ఫ్యాన్స్ కి ఇది మింగుడుపడని నిజమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్నది.
చూద్దాం.. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగి ఐటం పాట పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.