తెలుగు చిత్రపరిశ్రమకి వచ్చి పదేళ్ళ దాటినా సరే సినిమా ఆఫర్స్ విషయంలో ఏ మాత్రం వేనుకపడని హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ పేరు చెప్పొచ్చు. మెగా హీరోలందరితోనూ నటించి మెగా హీరోయిన్ అనే పేరుని తన ఖాతాలో వేసేసుకుంది.
ఇక తాజాగా ఆమె ఒక కొత్త హీరో పక్కన చేయడానికి ఒప్పుకున్నట్టుగా సమాచారం. ఆ కొత్త హీరో ఎవరంటే- ప్రముఖ నిర్మాత DVV దానయ్య కుమారుడు అట, ఇతను హీరోగా పరిచయం ఆఎందుకు కావాల్సిన శిక్షణ తీసుకున్నాడట. ఇప్పుడు ఈయనని హీరోగా పరిచయం చేసే సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకోనున్నరాట, ఇప్పుడు ఇది ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ ఇలా ఒక కొత్త హీరోతో చేయడానికి ఒప్పుకోవడం ఒకరకంగా సాహసమనే చెప్పాలి. అయితే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది అనేది ఒక పాయింట్ అయితే ఈ సినిమాకి తేజ దర్శకత్వం చేయనున్నాడని సమాచారం.
కాజల్ ని తీసుకొచ్చింది తేజ అని వేరే చెప్పకర్లేదు, తాజాగా ఆయన తీసిన నేనే రాజు నేనే మంత్రిలో కూడా మంచి పాత్రలో మెరిసింది.
ఏదేమైనా.. ఒక కొత్త హీరో పక్కన నటించడానికి ఒప్పుకోవడం నిజంగా గ్రేట్...