రేణు దేశాయ్ పెళ్ళి పై స్పందించిన పవన్

మరిన్ని వార్తలు

గత కొంతకాలంగా రేణు దేశాయ్ రెండవ వివాహం గురించిన అంశం పవన్ కళ్యాణ్ అభిమానులలో, సోషల్ మీడియాలో, సాధారణ మీడియాలో నలుగుతూనే ఉంది. ఈ అంశం పై ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు ఏమి స్పందించలేదు. 

అయితే కొద్ది నిమిషాల క్రితం ఆయన ఈ అంశం పైన స్పందించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే- జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్న రేణు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తన జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. 

దీనితో ఈ మొత్తం అంశానికి తెరపడినట్టుగా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు అత్యుత్సాహంతో రెండవ వివాహం చేసుకోబోతున్న రేణు దేశాయ్ ని తిట్టడం లాంటివి చేస్తున్నారు, మరి ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ తన విషెస్ చెప్పడంతో వారి విమర్శలకి ఏమాత్రం విలువ లేకుండా పోయింది. 

ఏదేమైనా.. తన మాజీ భార్య ఒక కొత్త ప్రయాణం మొదలుపెడుతున్న సమయంలో ఇలా మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలపడం మంచి సాంప్రదాయం అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS