చందమామను ఓ బంపర్ ఛాన్స్ వరించిందందంటూ ఘాటు ఘాటుగా ప్రచారం జరుగుతోంది. విశ్వనటుడు కమల్‌హాసన్ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా ఎంపికైందట.
కమల్‌హాసన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అలాగే సినిమాలు చేసేందుకూ సిద్ధంగానే ఉన్నారు. అందులో భాగంగానే, ఆయన గతంలో నటించిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోందిన్నాళ్లకు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుందట. శంకర్ దర్శకత్వంలో తెరక్కెనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అందులో భాగంగా కమల్ సరసన 'భారతీయుడు 2' కోసం ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఎంచుకున్నారట.
వారిలో ఒకరు నయనతార కాగా, మరో భామ చందమామనీ తాజా సమాచారమ్. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. తొలిసారి విశ్వనటుడు కమల్‌హాసన్‌తో జత కట్టే అవకాశం తనని వరించినందుకు చందమామ ఆనందం ఆకాశాన్నంటేస్తోందట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి స్టార్‌హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న కాజల్ ఈ మధ్య ఊహించని విధంగా మెగాస్టార్‌తో ఆయన 150వ చిత్రంలోనూ నటించి తీరని కోరిక తీర్చేసుకుంది.
ఇక కమల్‌హాసన్‌తో కూడా నటించిందంటే కెరీర్‌లో అంతకన్నా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఇంకేముంటుంది. అయితే ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఈలోగా ఈ గాసిప్ కోలీవుడ్ నుండి టాలీవుడ్, తర్వాత బాలీవుడ్ వరకూ కూడా చక్కర్లు కొట్టేస్తోంది. అయితే ఇది గాలి వార్త.? నిజంగా నిజమేనా.?
చూడాలిక. ప్రస్తుతం కాజల్ తెలుగులో యంగ్‌హీరో బెల్లంకొండతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్' చిత్రంలో నటిస్తోంది.