మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాడంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్‌పై నిర్మాత డివివి దానయ్య తాజాగా క్లారిటీ ఇచ్చారు.
నవంబర్ రెండో వారంలో డబ్బింగ్ స్టార్ట్ అవుతుందట. ఈలోగా చిత్రీకరణ దాదాపు పూర్తి కానుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారమ్. ఫస్ట్‌లుక్ త్వరలో విడుదల చేస్తారట. అది కూడా దీపావళి కానుకగా వచ్చే వారమే విడుదల కానున్నట్లు మరోవైపు అందుతోన్న సమాచారమ్.
ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దీపావళికి టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్ రానుందట. శరవేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. 'భరత్ అనే నేను' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కైరా అద్వానీ, చరణ్‌కి జోడీగా నటిస్తోంది. కైరా మంచి డాన్సర్. కానీ తొలి సినిమాలో పెద్దగా డాన్సులేసే అవకాశం రాలేదీ బ్యూటీకి. ఈ సినిమాలో చరణ్ పక్కన డాన్సులేయడం చాలా ఆనందంగా ఉందంటోంది. డాన్సుల్లో ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్యాన్స్‌కి ఫ్రెష్ ఫీల్ ఇవ్వబోతోందట.
బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌కీ ప్రాధాన్యత ఉంది. అజర్ బైజాన్‌లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించారు. 'రంగస్థలం'లో పల్లెటూరి కుర్రోడి గెటప్‌లో కొత్తగా అలరించిన రామ్ చరణ్ ఈ సినిమా కోసం లవర్ బోయ్ గెటప్‌కి మారిపోయాడు.