ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వివాదం రేగినా - దానిపై సెలబ్రెటీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాళ్లేం చెబుతారు? అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే సెలబ్రెటీల స్టేట్‌మెంట్లకు విస్తారంగా ప్రచారం లభిస్తుంటుంది. అలాగని స్టార్లు కూడా ఏది పడితే అది మాట్లాడేయకూడదు. కాస్త నోరు జారినా.. దాని పర్యావసానాలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే... ఏ విషయంలో స్పందించాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? అనే విషయంపై వాళ్లు చాలా క్లారిటీగా ఉంటారు.
తాజాగా శబరిమల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆలయంలో మహిళలకు ప్రవేశంపై చాలా చర్చ జరుగుతోంది. దీనిపై సినిమావాళ్లు కొంతమంది తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఓ నెటిజన్ రామ్‌చరణ్, మంచు మనోజ్ ఈ విషయంలో ఎందుకు స్పందించరు?? అని ప్రశ్నించాడు. ఎందుకంటే... మనోజ్, చరణ్ ఇద్దరూ అయ్యప్ప భక్తులు. చరణ్ అయితే ప్రతీ యేటా అయ్యప్ప మాల వేసుకుంటుంటాడు. నెటిజన్ ప్నశ్నకు మనోజ్ స్పందించాడు.
ముందు మనం పేదల గురించి ఆలోచించాలి, వాళ్లకు కనీస వసతులు కల్పించడంపై దృష్టి పెట్టాలి, మనందరికీ దేవుడిపై నమ్మకం ఉంది, ఆయనకు వచ్చిన సమస్య ఆయనే పరిష్కరించుకుంటాడు అని ట్వీట్ చేశారు. `మనం మాట్లాడుకోవడానికి ఇంతకంటే గొప్ప టాపిక్కులు ఉన్నాయి` అనే అర్థం మనోజ్ ట్వీట్‌లో పరోక్షంగా కనిపిస్తోంది. అదీ.. పాయింటే.
మరి దీనిపై చరణ్ ఏమని స్పందిస్తాడో చూడాలి.