శర్వాతో కాజల్‌ అలా కాదట?

By iQlikMovies - April 10, 2018 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ ఓ సినిమాలో నటిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో శర్వా రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రల్లోనూ శర్వానంద్‌ ఓ పాత్ర కోసం కాస్త ఏజ్‌ బార్‌ ఉన్న వ్యక్తిలా కనిపించనున్నాడట. ఆ గెటప్‌లో శర్వాకి జోడీగా చందమామ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ నటించనుందనీ ప్రచారం జరుగుతోంది. 

అయితే మరో పక్క కాజల్‌ పాత్ర అది కాదట. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కాజల్‌ నటించబోతోందనీ తాజా సమాచారమ్‌. ఆ ప్రత్యేక పాత్రేంటో తెరపైనే చూడాలంటున్నారు. సినిమాకి అత్యంత కీలకమైన, యాక్టింగ్‌కి పర్‌ఫెక్ట్‌ స్కోపున్న పాత్ర అది అంటున్నారు. మరో వైపు కాదు కాదు, శర్వాకి జోడీగానే కాజల్‌ నటిస్తోందనీ అంటున్నారు. ఈ మధ్య యంగ్‌ హీరోస్‌తో ఎక్కువగా జత కడుతోంది కాజల్‌. అందులో భాగంగానే శర్వాతో ఈ సినిమాకి సైన్‌ చేసిందనీ తెలుస్తోంది. 

'హలో'తో తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణీ ప్రియదర్శిన్‌ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట్లో ఈ పాత్రకు నిత్యామీనన్‌ని అనుకున్నారు. ఆ ప్లేస్‌లోకి కళ్యాణీ వచ్చి చేరింది. శర్వానంద్‌ టీనేజ్‌ పాత్రకి కళ్యాణిని జోడీగా ఎంచుకున్నారట. ప్రస్తుతం శర్వానంద్‌ 'పడి పడి లేచె మనసు' సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS