మెగా కాంపౌండ్‌కి మరో హీరో దొరికాడండోయ్‌

మరిన్ని వార్తలు

మహావృక్షం మెగాస్టార్‌ అయితే, ఆ మహావృక్షం నుండి వచ్చిన కొమ్మలు ఎన్నో. టాలీవుడ్‌లో ఇప్పటికే ఈ కొమ్మలు ఆ మహావృక్షం నీడన మెల్లమెల్లగా వృక్షాల స్థాయికి ఎదుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ మహావృక్షం నీడలోకి మరో మెగా హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే గాసిప్‌ వినవస్తోంది. ఆ హీరో మరింకెవరో కాదు, పవన్‌ కళ్యాణ్‌ మొట్ట మొదటి వారసుడు అకీరానందన్‌. 

పవన్‌కళ్యాణ్‌ - రేణూదేశాయ్‌ మొదటి సంతానం అయిన అకీరానందన్‌కి ఇప్పుడు 14 ఏళ్లు. మరో నాలుగేళ్లు వస్తే హీరోగా పర్‌ఫెక్ట్‌ అయిపోతాడు. ఆల్రెడీ తెలుగులో నటించకపోయినా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నిరూపించుకున్నాడు. ఇక హీరోగా సత్తా చాటడమే మిగిలుంది. రేణూ దేశాయ్‌తో బ్రేకప్‌ అయినా కానీ అకీరానందన్‌ పవన్‌ కళ్యాణ్‌ వారసుడే. సో హీరో అవ్వాలనుకుంటే, అకీరానందన్‌కి అడ్డేమీ లేదు. తల్లి రేణూదేశాయ్‌ నుండి కూడా పూర్తి సపోర్ట్‌ దక్కుతుంది ఆ విషయంలో. ఇక అభిమానుల సంగతి చెప్పనే అక్కర్లేదు. 

మనస్పూర్తిగా అకీరాని ఆహ్వానిస్తారు. ఇకపోతే, అసలింతకీ అకీరానందన్‌ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ రోజు ఈ జూనియర్‌ పవర్‌స్టార్‌ బర్త్‌డే కావడంతో, సోషల్‌ మీడియాలో విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అకీరానందన్‌కి విషెస్‌ చెబుతూ ఓ ఫోటో పోస్ట్‌ చేశాడు. ఆ ఫోటోతోనే ఈ గాసిప్స్‌ పుట్టుకొచ్చేస్తున్నాయ్‌. 

పవర్‌స్టార్‌, మెగాపవర్‌స్టార్‌తో కలిసి జూనియర్‌ పవర్‌స్టార్‌ అదిరిపోయాడుగా అంటూ ఈ ఫోటోపై కామెంట్స్‌ కుప్పలుతెప్పలుగా వచ్చేస్తున్నాయి. అవును మరి తండ్రిని మించిన తనయుడిలా అందం, పర్సనాలిటీలో పవన్‌ని మించిపోయాడు మరి. ఇంకేముంది అకీరానందన్‌ హీరో అయితే మెగాకాంపౌండ్‌లో మెగాప్రిన్స్‌ వరుణ్‌కి అందంలో గట్టి పోటీనే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS