దాదాపుగా ఒక ఆరు నెలల తరువాత ఈ మధ్యనే ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్.
ఇక ఈ చిత్రానికి దర్శకుడు తేజ దర్శకత్వం వహించనుండగా సదరు షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ఎవరు నటించనున్నారు అన్నదాని పైన తీవ్ర చర్చ నడుస్తున్న వేళ ఒక విషయం తెలిసింది.
అదేంటంటే - ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసాడట! కాజల్ అగర్వాల్ ని తెలుగు తెరకి పరిచయం చేసింది దర్శకుడు తేజానే. అలాగే ఆయన గత చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' లో కూడా తననే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మొత్తానికి మొన్న అబ్బాయి సరసన నటించిన ఈ భామ ఇప్పుడు బాబాయ్ పక్కన నటిస్తుండటం అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది.