ఇటీవల 'సీత' సినిమాతో చందమామ కాజల్ అగర్వాల్ తెగ సందడి చేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రంటూ హల్‌చల్ చేసింది. పూర్తిగా హీరోయిన్ సెంట్రిక్ మూవీగానే ఈ సినిమాని ప్రొజెక్ట్ చేశారు. కానీ, తీరా విడుదలయ్యాక కాజల్ తేలిపోయింది. దాంతో విజయం ఆమెని వదిలి పారిపోయింది. 'సీత'తో సో సో అనిపించుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు తమిళంలో 'కోమలి'గా రాబోతోంది. జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. తెలుగులో వరుస సినిమాలు వరుసగా నిరాశపరిచాయి కాజల్‌ని. దాంతో ఇప్పుడు తమిళంలపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. తమిళంలో నిజానికి కాజల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో 'ప్యారిస్ ప్యారిస్' ఎప్పుడో విడుదలకు సిద్ధమవ్వాల్సింది.
కానీ, ఆ సినిమా స్టేటస్ ఏంటో తెలియరావడం లేదు. ఆ సంగతి అలా ఉంటే, కోటి ఆశలతో సైన్ చేసిన 'ఇండియన్ 2' అతీ గతీ లేకుండా పోయింది. అప్‌డేట్స్ కన్నా, గాసిప్సే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి ఈ సినిమాకి సంబంధించి. ఇకపోతే తాజా సినిమా 'కోమలి'. ఈ సినిమా అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 'తనీ ఒరువన్', 'వనమగన్' తదితర చిత్రాలతో మంచి విజయాలు అందుకుని, కోలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరో జయం రవి. సో ఈ సినిమాపై కాజల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా తన కెరీర్‌కి పూల బాట వేస్తుందని నమ్ముతోంది. కాజల్ నమ్మకం నెరవేరుతుందా.? వేచి చూడాలిక.