బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ లిస్టులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ పేరు ఉందంటూ ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన రేణూదేశాయ్ ఈ విషయమై డీటెయిల్డ్‌గా క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ 3 పార్టిసిపెంట్‌గా తననెవరూ సంప్రదించలేదనీ, సో ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదనీ ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సో బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ లిస్టు నుండి రేణూదేశాయ్ పేరు డిలీట్ అయిపోయినట్లే. అయితే గమనించాల్సిన అంశమేంటంటే, ఆమె మరో హింట్ ఇచ్చారిక్కడ. కంటెస్టెంట్‌గా 100 రోజులపాటు, హౌస్‌లో ఉండేందుకు ఇష్టం లేదు.
కానీ, హోస్ట్‌గా అయితే చేయడానికి తాను సిద్ధమే అని రేణూ స్పష్టం చేశారు. ప్రస్తుతం రేణూదేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు సైన్ చేశారు కూడా. అంతేకాదు, నటన కన్నా డైరెక్షన్ ఫీల్డ్ అంటేనే రేణూదేశాయ్‌కి మొదట్నుంచీ మక్కువ. ఆ మక్కువతోనే త్వరలో ఓ తెలుగు మూవీని డైరెక్ట్ చేయబోతున్నారామె. అందుకు సంబంధించిన స్క్రిప్టు పనుల్లోనూ ప్రస్తుతం బిజీగా ఉంది. సో ఇన్ని కమిట్మెంట్స్‌తో వంద రోజులు హౌస్‌లో ఉండడం కుదరదనీ, వారానికి ఒక రోజు మాత్రమే అవసరమయ్యే హోస్టింగ్‌కి అయితే తాను సిద్ధమేనని చెప్పారు. అయితే, బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా నాగార్జున పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఒకవేళ అది కూడా ప్రచారమే అయ్యుంటే, రేణూ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్‌తో బిగ్‌బాస్ 3 నిర్వాహకులు నిరభ్యతరంగా రేణూదేశాయ్‌ని హోస్ట్‌గా తీసుకోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలిక.