ఇద్దరమ్మాయిలతో బెల్లంకొండ రొమాన్స్‌.!

By iQlikMovies - July 11, 2018 - 17:23 PM IST

మరిన్ని వార్తలు

స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడమే కాకుండా, భారీ బడ్జెట్‌ సినిమాల్లో కూడా నటిస్తుంటాడు యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. అంతేకాదు ఈ హీరో సినిమాల్లో హీరోయిన్లదీ ప్రాధాన్యత స్థాయే. అలాంటిలాంటి హీరోయిన్లు కాదు, స్టార్‌ హీరోలతోనే ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తుంటాడు మనోడు. 

బెల్లంకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సాక్ష్యం' విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రజెంట్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌ అయిన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కాక మరో రెండు సినిమాలు బెల్లంకొండ లైన్‌లో పెట్టేశాడు. ఈ రెండు సినిమాల్లోనూ చందమామ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా వీటిలో ఓ సినిమాను కొత్త డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం బెల్లంకొండ ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయనున్నాడనీ తాజా సమాచారమ్‌. 

ఒకరు కాజల్‌ కాగా, మరో భామ మెహ్రీన్‌ కౌర్‌ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కీ ఈక్వెల్‌ ఇంపార్టెన్స్‌ ఉంటుందట. ఆల్రెడీ మెహ్రీన్‌ వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్‌ 2'లో నటిస్తోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్‌తో పాటు నటిస్తోంది. అలాగే బెల్లంకొండ సినిమా కోసం మెహ్రీన్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ని తోడుగా తెచ్చుకుంటోంది కాబోలు. సోలోగా వస్తుంటే సక్సెస్‌ దక్కడం లేదనీ, మెహ్రీన్‌ ఇలాంటి డెసిషన్‌ తీసుకుందేమో. 

చూడాలిక ఈ కంబైన్డ్‌ కనెక్షన్‌ అయినా మెహ్రీన్‌కి హిట్‌ తెస్తుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS