బిగ్ హౌస్‌లో కొత్తగా కెప్టెన్ అయిన బాబా భాస్కర్ తాను ముందుగా చెప్పినట్లుగానే రూల్స్ పెట్టారు. అమ్మాయిలు షార్ట్ డ్రస్సులు వేసుకోవద్దని సూచించారు. అయితే తన సూచనను ఆర్డర్‌లా కాకుండా, రిక్వెస్ట్‌లా తీసుకుని పర్టిక్యులర్‌గా పునర్నవికి చెప్పారు బాబా భాస్కర్. లేడీస్ అందరూ ఆయన రూల్‌ని పాఠించినట్లే ఉంది కానీ, శ్రీముఖి మాత్రం పాఠించలేదు. పొట్టి డ్రస్సుల్లోనే కనిపించింది. ఇక శ్రీముఖిని తన పర్సనల్ అసిస్టెంట్‌గా నియమించుకున్న బాబా భాస్కర్, ఆమెతో గార్డెన్ ఏరియాలో సోఫాలు క్లీన్ చేయించి మగ కంటెస్టెంట్స్‌ని ఆ సోఫాల్లో కూర్చోబెట్టారు.
అలాగే హౌస్‌లో గట్టిగా అరవడం నిషేధం అని శ్రీముఖికి ఆర్డర్ వేశారు. తనను టార్చర్ పెట్టేస్తున్నాడీ కొత్త కెప్టెన్.. అంటూ శ్రీముఖి కాసేపు ఫన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎప్సన్ హ్యాపీ ఫేస్ డే టాస్క్‌లో ర్యాపిడ్ ఫైర్‌గా ఫన్నీ ఆన్సర్స్ చెప్పినందుకు మహేష్ విన్నర్‌గా నిలిచాడు. ఎప్సన్ హ్యాపీ ఫేస్ టీషర్ట్ మహేష్‌కి బహుమతిగా లభించింది. ఆ రోజంతా మహేష్‌తో హౌస్‌మేట్స్ అంతా ఏ విషయమైనా నవ్వుతూనే మాట్లాడాలన్నది ఆ టాస్క్‌లో భాగం.
ఇక ఆ తర్వాత హౌస్‌మేట్స్‌కి తమ కుటుంబ సభ్యులు పంపిన లవ్‌లీ లెటర్స్, ఇష్టమైన వంటకాలు వచ్చాయి. లెటర్స్‌లోని మేటర్‌ని హౌస్‌మేట్స్‌తో పంచుకున్నారు. వంటకాలను అందరూ పంచుకుని సరదాగా భోజనం చేశారు. అలా బిగ్‌బాస్‌లో తాజా ఎపిసోడ్ సరదా సరదాగా సాగింది.