యాక్షన్‌ మోడ్‌లో చందమామ!

By iQlikMovies - August 07, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

చందమామ కాజల్‌ అగర్వాల్‌ విశ్వనటుడు కమల్‌ హాసన్‌తో 'ఇండియన్‌ 2'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనేక వివాదాల నడుమ అలా హోల్డ్‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో స్టార్ట్‌ కానుందట. డేట్‌ కరెక్ట్‌గా కన్‌ఫామ్‌ చేయలేదు కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆగస్ట్‌ మూడో వారంలో 'ఇండియన్‌ 2' పట్టాలెక్కనుందనీ తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కాజల్‌ అగర్వాల్‌ కూడా జాయిన్‌ కానుందట.

 

రెగ్యులర్‌ కమర్షియల్‌ పాత్రలకు భిన్నంగా కాజల్‌ పాత్ర ఉండబోతోందట ఈ సినిమాలో. ఆ క్రమంలో కాజల్‌ కొన్ని యాక్షన్స్‌ సీన్స్‌లో నటించనుందనీ తెలుస్తోంది. అందుకోసం, కేరళ మార్షల్‌ ఆర్ట్‌ కలరిపట్టులో కాజల్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందట. ఈ సినిమా తనకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అనీ, ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న గాసిప్స్‌ తనకెంతో బాధను కలిగిస్తున్నాయనీ కాజల్‌ గతంలో చెప్పింది.

 

సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్ని కాజల్‌ ఖండించింది. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం కాజల్‌ కలరిపట్టులో శిక్షణ 'ఇండియన్‌ 2' సినిమా కోసమే అని తెలియడంతో, ఆ గాసిప్స్‌కి కొంత మేర చెక్‌ పెట్టినట్లయ్యింది. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్దార్ద్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS