ఛాలెంజింగ్‌ రోల్‌లో చందమామ.!

మరిన్ని వార్తలు

తమిళ, తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది చందమామ కాజల్‌ అగర్వాల్‌. 

తమిళంలో 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రంలో నటిస్తోంది కాజల్‌. బాలీవుడ్‌ 'క్వీన్‌'కి తమిళ రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. కాజల్‌ని పరిపూర్ణ నటిగా తీర్చిదిద్దే సినిమా ఇది. కాగా తెలుగులో కాజల్‌ అగర్వాల్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్‌ హీరోయిన్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన కాజల్‌ అగర్వాల్‌ ఇప్పుడు ఓ మోస్తరు హీరోలతోనూ జత కడుతోంది. 

మెగాస్టార్‌ చిరంజీవితో 'ఖైదీ'లో నటించిన కాజల్‌ ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌, రానా ఇలా ఇప్పుడు బెల్లకొండ వరటి యంగ్‌ హీరోస్‌తోనూ జత కట్టేందుకు జోరు చూపిస్తోంది. అయితే కాజల్‌ - బెల్లంకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రంలో కాజల్‌ ఓ ఛాలెంజింగ్‌ రోల్‌ పోషిస్తోందనీ తాజా సమాచారమ్‌. అది నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రనీ ప్రచారం జరుగుతోంది. 

తమిళ హీరో ధనుష్‌ నటించిన 'రఘువరన్‌ బీటెక్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'విఐపీ 2' చిత్రంలో సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌ నటించిన పాత్రకు దగ్గర పోలికలతో ఉండబోతోందట చందమామ ఈ సినిమాలో పోషించే పాత్ర. అలా అని గ్లామర్‌కి దూరం కాదట. పక్కా గ్లామరస్‌ పాత్రట. ఇంతవరకూ కాజల్‌ పోషించిన పాత్రలన్నీ ఒకెత్తు. ఈ సినిమాలో కాజల్‌ పాత్ర మరో ఎత్తు అనీ టాక్‌ వినిపిస్తోంది. చూడాలి మరి కాజల్‌ పోషిస్తోన్న ఆ ఛాలెంజింగ్‌ రోల్‌ ఎలా ఉండబోతోందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS