ముద్దుగుమ్మ కాజల్‌కి యంగ్ హీరోయిన్ రీతూ వర్మ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. అలాగే పర్సనల్‌గానూ రీతూ చాలా మంచి అమ్మాయి అని కితాబిచ్చేస్తోంది కాజల్. కాజల్, రీతూ వర్మ కలిసి 'బాద్‌షా' సినిమాలో నటించారు. ఆ సినిమాలో కాజల్‌కి చెల్లెలిగా నటించింది రీతూ వర్మ. ఆ తర్వాత సోలో హీరోయిన్‌గా నటించిన 'పెళ్లిచూపులు' సినిమా ఘన విజయం సాధించింది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది రీతూ వర్మ. తమిళంలో స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. రీతూ నటన పట్ల చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. అందుకే ఈ తరం హీరోయిన్లలో రీతూ వర్మ ది బెస్ట్ హీరోయిన్ అంటోంది చందమామ. అంతేకాదు ఆడియన్స్ కూడా రీతూ వర్మని కాజల్ చెల్లెలిగా అభివర్ణిస్తూ ఉంటారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్, అందం ఇలా కొన్నింటిలో కాజల్‌ని తలపిస్తూ ఉంటుంది రీతూ వర్మ. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఒక్కసారి సినిమాల్లోకి ఎంటర్ అయితే ఇక అంతే. సినిమా కోసం ఏమైనా చేయాలనిపిస్తుందంటోంది ముద్దుగుమ్మ రీతూ వర్మ. అందుకే సినిమా పట్ల ప్యాషన్‌తోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉందనీ రీతూ వర్మ ఓ సందర్భంలో చెప్పింది. కాజల్‌తో బెస్ట్ హీరోయిన్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై బెస్ట్ అనిపించుకునేలానే, మంచి మంచి క్యారెక్టర్స్‌ని ఎంచుకొనే పనిలో నిమగ్నమై ఉందట. మరో పక్క కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో రానాతో జత కడుతోంది. ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.