ఆ ఎపిసోడ్‌.. షాక్‌కి గురైన కాజల్‌ అగర్వాల్‌.

మరిన్ని వార్తలు

సినీ జనాలపై అభిమానానికి హద్దులుండవు. బ్లాక్‌ మార్కెట్‌లో సినిమా టిక్కెట్‌ చూడటం దగ్గర్నుంచి, అభిమాన నటీనటుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం వరకూ.. ఓ లెక్క. కానీ, ఆ అభిమానం పేరుతో మోసాలకు పాల్పడటం లేదా మోసాలకు గురవడమం అనేది ఇంకో లెక్క. చెన్నయ్‌కి చెందిన ఓ అభిమాని, కాజల్‌ అగర్వాల్‌ కోసం 60 లక్షలు ఖర్చు చేశాడట. అయితే, ఇదంతా ఆమెను కలిసేందుకే. కొందరు వ్యక్తులు నమ్మించి, సదరు కాజల్‌ అభిమానిని మోసం చేశారు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడట.

 

తీగ లాగితే డొంక కదిలినట్లు, ఈ వ్యవహారంలో ఓ సినీ నిర్మాత హస్తాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఆనోటా ఈనోటా కాజల్‌ చెవిన పడ్డంతో ఆమె షాక్‌కి గురయ్యిందట. అభిమానులు ఇలా కూడా మోసపోతారా? అని ఆమె తన సన్నిహితుల వద్ద ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు, అభిమానుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని కూడా అనుకుంటోందట.

 

కాజల్‌కి బోల్డంతమంది అభిమానులున్నారు. తెలుగు, తమిళ హిందీ భాషల్లో సినిమాలు చేసిన కాజల్‌కి లక్షలాది మంది అభిమానులు వున్నారన్న విషయం తెల్సిందే. అభిమానులతో కాజల్‌ బాగానే ఇంటరాక్ట్‌ అవుతుంది కూడా. అలాంటి కాజల్‌ని కలిసేందుకు 60 లక్షలు ఎవరికో ఇవ్వడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అమాయకత్వమా? లేదంటే, ఏదన్నా అత్యుత్సాహంతో సదరు అభిమాని ఈ పని చేశాడా? అన్నది తెలియాల్సి వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS