బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్

మరిన్ని వార్తలు

రోజు రోజుకి తెలుగు బిగ్ బాస్ హీట్ మరింత పెరిగిపోతుంది. రెండవ వారం తరువాత షో లో, గొడవలు కాంట్రవర్సీలు ప్రేక్షకులను మరింత ఉత్కంఠతకు గురి చేస్తున్నాయి. అంతే కాకుండా తాజా అప్ డేట్ ప్రకారం గత రెండు సీజన్ల కంటే నాగార్జున హోస్టింగ్ చేసిన 3వ సీజన్ కు ఎక్కువ టి.ఆర్.పి (17.9) రావడం విశేషం. ఇక 10వ రోజు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో లగ్జరీ బడ్జెట్ టాస్క్ విషయంలో వరుణ్ సందేశ్ మరియు సింహాద్రి తమన్నా జైల్లోకి వెళ్లడం వంటి సీన్స్ తో పాటు.. 8 మంది ఎలిమినేషన్ లిస్ట్ లో ఉండటంతో బిగ్ బాస్ సీజన్ 3 ఇంటరెస్టింగ్ గాకొనసాగుతుంది.

ఇదిలా ఉంటే గత సీజన్ లో హౌస్ లోకి సుమ మరియు కమల్ హాసన్ లాంటి సెలెబ్రిటీలు సర్ప్రైజ్ ఎంట్రీలు ఇచ్చి తమ షోలు మరియు సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ఈ 3వ సీజన్ కు వస్తున్న బజ్ ని కాష్ చేసుకునేందుకు పలువురు సెలబ్రిటీలు ముందుకు రానున్నారు.. వారిలో మన సుడిగాలి సుధీర్ ముందుగా వస్తున్నాడని టాక్.

ఇప్పటివరకు యాంకర్ గా మనకి తెలిసిన సుధీర్, తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం 'సాఫ్ట్ వేర్ సుధీర్'. ఈ చిత్రాన్ని బిగ్ బాస్ హౌస్ ద్వారా ప్రమోట్ చేయబోతున్నాడని టాక్. ఇవే కాకుండా ముందు ముందు ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఈ షో ఇస్తుందో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS