'సీత' చేసిన మేలు అంతా ఇంతా కాద‌యా!

By iQlikMovies - April 24, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

ఈవారం విడుద‌లైన రెండు సినిమాలు జెర్సీ, కాంచ‌న 3ల‌కు వ‌సూళ్లు బాగానే ఉన్నాయి. నిజానికి ఈ వారంతో వీటి భ‌విత‌వ్యం తేలిపోవాల్సింది. ఎందుకంటే ఇది స‌మ్మ‌ర్ సీజ‌న్‌. ప్ర‌తీ వారం ఓ కొత్త సినిమా రావ‌డానికి రెడీ అయిపోతోంది. సినిమా ఎంత బాగున్నా - దాని కాల‌ప‌రిమితి వారం మాత్ర‌మే. కాక‌పోతే జెర్సీ, కాంచ‌న 3ల‌కు మ‌రో వారం గ్యాప్ వ‌చ్చింది. ఈనెల 24న రావాల్సిన తేజ `సీత‌` వాయిదా ప‌డ‌డంతో.. ఈ రెండు సినిమాల‌కూ లాభం చేకూర్చిన‌ట్టు అయ్యింది.

జెర్సీ సినిమాకి ఏ సెంట‌ర్ల‌లో వ‌సూళ్లు బాగున్నాయి. కాంచ‌న 3.. బీ, సీల‌లో కుమ్ముకుంటోంది. సోమ‌వారం నుంచి ఈ రెండు సినిమాల‌కూ వ‌సూళ్లు కాస్త డ్రాప్ అయ్యాయి. మ‌ళ్లీ తేరుకోవాలంటే శ‌ని, ఆదివారాలు రావాలి. అయితే.. ఈమ‌ధ్య‌లో ఏ కొత్త సినిమా వ‌చ్చినా - జెర్సీ, కాంచ‌న 3 సైడ్ అయిపోవాల్సివ‌చ్చేది. కానీ... అలాంటి ప్ర‌మాదాలేం జ‌ర‌గ‌డం లేదు. ఈ వారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మ‌రో కొత్త సినిమా రాక‌పోవ‌డం ఈ రెండు సినిమాల‌కూ క‌లిసొచ్చింది.

ఈ వీకెండ్ కూడా... వ‌సూళ్లు రాబ‌ట్టుకునే ఛాన్స్ వ‌చ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వ‌డానికి ఇంత‌కంటే మంచి అవ‌కాశం రాదేమో. మ‌రి ఈ ఖాళీని ఈ రెండు సినిమాలూ ఎలా స‌ద్వినియోగం చేసుకుంటాయో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS