తమన్నా పెళ్లంట అంటూ గాసిప్స్ ఈ మధ్య తెగ చక్కర్లు కొట్టాయి. గాసిప్స్ ఏంటి. దాదాపు కన్‌ఫామ్ చేసేసినంత పని చేశారీ వార్తల్లో. అయితే ఇదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఈ వార్తల్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో ఫుల్‌గా రౌండ్ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా.
'ముందేమో ఓ సినీ ప్రముఖుడితో నా పెళ్లన్నారు. ఇప్పుడేమో డాక్టర్ అంటున్నారు. ఎవర్ని పెళ్లి చేసుకోవాలో అది నా ఇష్టం. ఇందులో దాచడానికి ఏముంది? అయినా పెళ్లంటే దాచాల్సిన విషయం కాదు. నా తల్లితండ్రులు వరున్ని వెతుకుతున్నారంటూ వచ్చే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. పెళ్లి అనుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను. ఇప్పటికైతే సినిమా కెరీర్‌ని మాత్రమే ప్రేమిస్తున్నాను..' అని చెప్పింది మిల్కీ బ్యూటీ.
తమన్నా వివరణపై చందమామ కాజల్ అగర్వాల్ స్పందించింది. 'టామీ ఇలాంటివి పట్టించుకోవద్దు. అర్ధం పర్ధం లేని ప్రచారం మామూలైపోయింది..' అని కాజల్, తమన్నాకి అండగా నిలిచింది. అవును సెలబ్రిటీస్ అందులోనూ హీరోయిన్స్ పెళ్లి వార్తలంటే అందరికీ ఆశక్తే కదా. పుట్టిందంటే చాలు పెరిగిందంటారు. క్షణాల్లో అందరికీ స్ప్రెడ్ అయిపోతుందీ వార్త. కానీ అందులో నిజమెంతుందనేది సదరు సెలబ్రిటీ ఇదిగో ఇలా స్పందిస్తే కానీ తెలీదు. అంతటితో కానీ ఈ గాసిప్స్‌కి తెర పడదు. తమన్నా విషయంలో అదే జరిగిందిప్పుడు.
ప్రస్తుతం తమన్నా 'సైరా నరసింహారెడ్డి'లో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్'లో తొలిసారి వెంకటేష్‌తో జోడీ కడుతోంది.