హాలీవుడ్‌ రేంజ్‌లో అదరగొట్టేశావ్‌ బాసూ.!

మరిన్ని వార్తలు

'గూఢచారి' ట్రైలర్‌ వచ్చింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. గతంలో విడుదలైన టీజర్‌తోనే అడవిశేష్‌ 'గూఢచారి' స్వరూపం ఏంటో బ్రీఫ్‌గా చెప్పేశాడు. ఇప్పుడు ట్రైలర్‌తో అది జస్ట్‌ స్వరూపం కాదు విశ్వరూపం అని తేల్చేశాడు. 

టీజర్‌, ట్రైలర్స్‌తో ఈ స్థాయిలో మేకింగ్‌ వేల్యూస్‌ రివీల్‌ చేసిన అడవిశేష్‌ సినిమాలో ఇంకెంత చేశాడోనంటూ ఆడియన్స్‌లో అమితమైన ఆశక్తి పెరిగిపోయింది. హాలీవుడ్‌ స్టైల్‌ మేకింగ్‌ అదిరిపోయింది. యాక్షన్‌ సీక్వెన్సెస్‌, సినిమాటోగ్రఫీ న భూతో న భవిష్యతి అనే రేంజ్‌లో ఉన్నాయి. వెండితెరపై ఓ అద్భుతంగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్‌తో చెప్పకనే చెప్పేశాడు అడవిశేష్‌. 

ఇకపోతే ఈ చిత్రానికి యండ్‌స్టర్‌ శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించగా, కథ, స్క్రీన్‌ప్లే అంతా అడవిశేష్‌దే. అడవిశేష్‌ కేవలం నటుడు మాత్రమే కాదు. మల్టీ టాలెంటెడ్‌. 'క్షణం' సినిమాతో సోలో హీరోగా తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఈ సారి అలా ఇలా రావట్లేదు. టాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌ అంటే తానే అనే ముద్ర వేసేలా ఉన్నాడీ సినిమాతో. భారీ బడ్జెట్‌ వేల్యూస్‌ స్క్రీన్‌పై ఆవిష్కృతం చేశారీ సినిమాలో. తెలుగమ్మాయి, మిస్‌ ఇండియా గ్రహీత శోభితా ధూళిపాళ్ల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.  హీరోయిన్‌గా అమ్మడు గ్లామర్‌ సినిమాకి మరో హైలైట్‌ కానుంది. లిప్‌లాక్స్‌, హాలీవుడ్‌ రేంజ్‌ ఎక్స్‌పోజింగ్‌ టోటల్‌గా 'గూఢచారి'ని హాలీవుడ్‌ సినిమాని దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. 

చూడాలి మరి ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన 'గూఢచారి' సినిమా విడుదలయ్యాక ఏం చేస్తాడో. వచ్చే నెల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS