పురాణాల్లో 'సీత' గీత దాటి రావణుడి చెరలో చిక్కింది. అంతే కానీ, ఎప్పుడూ సీతగా తన తీరును విడిచిపెట్టలేదు. సీత అంటే సాత్విక మహిళ, పవిత్రతకు చిహ్నం, ఓర్పుకు నిదర్శనం. కష్టాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ఇలా మనకు తెలిసిన ఇంగ్లీష్, తెలుగు మీనింగ్స్ చెప్పేస్తూ ఉంటాం. అయితే ఇది పౌరాణికం. మన మన మోడ్రన్ 'సీత' ఒకరు త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు కదా. అదేనండీ కాజల్ నటిస్తోన్న 'సీత' సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
ఈ సినిమాలో కాజల్ నెగిటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించబోతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే, జస్ట్ నెగిటివ్ ఛాయలే కానీ, కాజల్ పాత్ర పూర్తి నెగిటివ్ కాదట. 'సీత'గా తన పాత్రలో ఓ చిన్న గీత ఉంటుందట. ఆ గీత దాటితే 'సీత' శూర్పణకే అవుతుందట. అయితే మన సీత ఆ గీతను దాటకుండా జాగ్రత్త పడిందట. దాంతో మన మోడ్రన్ 'సీత' అనే పేరుకు ఎలాంటి నెగిటివ్ మరకలు అంటకుండా జాగ్రత్త పడ్డానని కాజల్ చెప్పుకొచ్చింది.
అంతేకాదు, ఇన్నేళ్ల కెరీర్‌లో తాను ఫిజికల్‌గా, మెంటల్‌గా కష్టపడిన పాత్ర ఇది.. ఇలాంటి పాత్రలు చాలా చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే కష్టపడినా ఇష్టంగా ఈ పాత్రను ఆస్వాదించాను.. ఖచ్చితంగా 'సీత'తో ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది ఫ్యాన్స్‌కి అని క్యూట్ క్యూట్‌గా మన చందమామ ముచ్చటించింది. ఈ నెల 24న 'సీత' ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని తేజ తెరకెక్కిస్తున్నాడు.