అందాల చందమామ కాజల్ అగర్వాల్ 'సీత' సినిమాతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రమిది. నిజానికి ఈ చిత్రాన్ని తేజ హీరోయిన్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కించాడనే ప్రచారం జరిగింది. కానీ, ఇదొక విభిన్నమైన కథ అని మాత్రమేనని చెబుతున్నాడు తప్ప, ఎక్కడా కాజల్‌ని సెంటర్ పాయింట్‌గా పెట్టి సినిమా తీసినట్లు తేజ ఇప్పటిదాకా ఓపెన్ అవలేదు.
మరోపక్క, టీజర్ - ట్రైలర్ చూశాక ఆడియన్స్‌కి ఓ ఐడియా వచ్చేసింది సినిమా మీద. ఇదిలా వుంటే, 'సీత' సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో చాలా ప్రచారాలు తెరపైకొచ్చాయి. అయితే అనూహ్యమైన బిజినెస్ చేసిన సీత, నిర్మాతకి బీభత్సమైన లాభాలు తెచ్చే ప్రాజెక్ట్ అవుతుందనీ ఈ విషయమై దర్శకుడు చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడనీ తెలుస్తోంది. భారీ స్కేల్‌లో ఇప్పటికే సినిమా రిలీజ్‌ని ప్లాన్ చేసిన నిర్మాతలు, సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ అదే జోరు ప్రదర్శిస్తున్నారు.
రొటీన్‌కి భిన్నంగా 'సీత' ప్రమోషన్స్ సాగుతుండడంతో సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి. 'ప్రతి సినిమానీ ఇష్టపడి, కష్టపడి చేస్తాం.. అయితే ఈ సినిమాని ఇంకాస్త ఎక్కువ ఇష్టపడి, కష్టపడి చేశా..' అంటూ కాజల్, సీత గురించి చెప్పుకొచ్చింది. సినిమా విడుదలకు ముందు చాలా నెగెటివ్ ప్రచారం జరిగిందనీ, ఆ నెగెటివ్ ప్రచారానికి సరైన సమాధానం చెప్పేలా సినిమా వుంటుందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు.