ఒకప్పుడు టాప్ కథానాయికగా వెలుగొందిన కాజల్ ఇప్పుడు తల్లయ్యింది. ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త మంగళవారమే బయటకు వచ్చింది. కాజల్ తల్లయ్యిందని, మగబిడ్డ పుట్టాడని వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే కాజల్ గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ స్పందించలేదు. ఎట్టకేలకు కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఈ విషయాన్ని ధృవీకరించింది.
గౌతమ్ కిచ్లూతో కాజల్ వివాహమైన సంగతి తెలిసిందే. గర్భం దాల్చిన విషయాన్ని కూడా కాజల్ స్వయంగా బయటపెట్టింది. బేబీ బంప్ ఫొటో షూట్‌లు చేసి, ఆ చిత్రాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఎట్టకేలకు తన కల ఫలించి.. తల్లయ్యింది. కథానాయికగా ఎప్పుడు అడుగు పెట్టాలో.. అప్పుడే అరంగేట్రం చేసింది. ఎప్పుడు పీక్స్ చేరాలో.. అప్పుడే.. అగ్రస్థానానికి వెళ్లింది. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో అప్పుడే చేసుకుంది. జీవితంలో నిర్ణయాలన్నీ సరైన సమయానికే తీసుకొంది. ఇప్పుడు తల్లిగా మారే విషయంలోనూ అంతే. జీవితాన్ని ఓ ప్రణాళికా బద్ధంగా నడుపుతూ.. అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యింది. తను నటించిన `ఆచార్య` ఈనెల 29న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.