టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోలు.. గప్ చుప్ గా పెళ్లి చేసుకుంటున్నారు. హీరోయిన్ల మనసూ.. పెళ్లి వైపు మళ్లుతోందిప్పుడు. తాజాగా కాజల్ పెళ్లికి రెడీ అయినట్టు టాక్. కాజల్ పెళ్లి విషయమై గత కొంతకాలంగా కాజల్ పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కాజల్ స్పందించలేదు. ఈసారి మాత్రం ఏకంగా కాజల్ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గౌతమఖ అనే వ్యాపార వేత్తతో కాజల్ నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయని తెలుస్తోంది.
కెరీర్ పరంగానూ కాజల్ మంచి స్వింగులో ఉంది. ‘ఇండియన్ 2’, ‘ఆచార్య’ `మోసగాళ్లు` సినిఆమలతో బిజీగా ఉంది. ఈ సినిమాల షూటింగులు పూర్తయ్యాకే కాజల్ పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. కాకపోతే.. లాక్ డౌన్, కరోనాల వల్ల షూటింగులు సజావుగా సాగడం లేదు. స్టార్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ గ్యాప్లో బ్రహ్మచారులంతా ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. కాజల్ కూడా అదే బాట పడుతుందా? లేదంటే చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటుందా? అన్నది తేలాలి.