సంసార జీవితంలో తలమునకలైపోతోంది కాజల్. గౌతమ్‌కిచ్లూని పెళ్లి చేసుకున్న తరవాత... అటు సినిమాలకూ, ఇటు వ్యక్తిగత జీవితానికీ తగిన సమయం కేటాయిస్తోంది కాజల్. అంతేకాదు.. కాజల్ గర్భవతి అని, అందుకే నాగార్జునతో ఓ సినిమా వదులుకుందని ప్రచారం జరిగింది. కాజల్ గర్భం దాల్చిన మాటైతే... అధికారికంగా చెప్పలేదు కానీ, నాగార్జున సినిమాని మాత్రం వదులుకోవడం నిజం. అంతేకాదు... తను ఇప్పుడు సినిమా వాతావరణానికి దూరంగా, భర్తతో ప్రశాంతమైన జీవితం గడుపుతోంది.
`మీరుతల్లి కాబోతున్నారా` అని మీడియా అడిగితే.. `సరైన సమయంలో.. సమాధానం చెబుతా` అని దాటేసింది. కాకపోతే.. అమ్మదనంలోని మాధుర్యాన్ని తాను ఇప్పటికే అనుభవిస్తున్నానని, గౌతమ్ కి..తను ఓ భార్యలానే కాకుండా, తల్లిలానూ సేవ చేస్తున్నా... అని పేర్కొంది కాజల్. ప్రేమ - పెళ్లి విషయంలో నర్మ గర్భమైన సమాధానాలు చెప్పే కథానాయికలు, అమ్మతనం విసయంలో ఇలా సీక్రెట్ కొనసాగిస్తారేంటో?