ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అంతా కాజల్ కేంద్రంగానే జరుగుతోంది. కాజల్ హీరోయిన్ అయితే సపోర్టింగ్ రోల్లో బెల్లంకొండ నటిస్తున్నాడా.? అన్నట్లుగా 'సీత' ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ప్రమోషన్స్ హంగామాతో, ఇప్పటికే సినిమా మీద విపరీతమైన బజ్ ఏర్పడింది. టైటిల్ హీరోయిన్ వైపు నుండి ఉండడం, కాజల్ పాత్రే సినిమాకి కీలకం కావడంతో, పూర్తిగా సినిమా సక్సెస్ కూడా కాజల్ స్టామినా మీదే ఆధారపడి ఉంది.
ఇంతవరకూ టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనుష్క తర్వాత, తమిళ డబ్బింగ్ సినిమాలతో నయనతార బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈ సినిమాతో కనుక కాజల్ హిట్ కొట్టిందా.? కాజల్ పేరు కూడా మార్మోగిపోవడం ఖాయం. దర్శకుడు తేజ కూడా ఈ సినిమాకి స్క్రిప్టు వెరీ వెరీ డిఫరెంట్‌గా రచించారు. 'సీత' అనే టైటిల్‌ని పెట్టి, కాన్సెప్ట్‌ని ఊహించనంత సమ్‌థింగ్ డిఫరెంట్‌గా రూపొందించడమంటే, గట్స్ ఉండాల్సిందే. మరి తేజ ఈ కాన్సెప్ట్‌ని టచ్ చేసి, ఆ ధైర్యం చేసేశాడు.
మరి సక్సెస్ విషయంలో తేజ ఎంత మేర విజయం సాధిస్తాడనేది వేచి చూడాలిక. మాస్, యాక్షన్ సినిమాలతో ఆకట్టుకున్న బెల్లకొండకు ఈ సినిమా సరికొత్త ఎక్స్పీరియన్స్ కానుంది. ఓ రకంగా చెప్పాలంటే బెల్లకొండ కూడా ప్రయోగం చేస్తున్నట్లే. చూడాలి మరి ఓ పక్క బెల్లంకొండ ప్రయోగం, మరోపక్క కాజల్ స్టామనా అన్నీ వెరసి తేజ చేసిన ఈ ధైర్యం ఎలాంటి ఫలితాన్నిస్తాయో.