కొరియ‌న్ రీమేక్ లో కాజ‌ల్‌

మరిన్ని వార్తలు

మ‌ళ్లీ రేసులోకి రావ‌డానికి కాజ‌ల్ ఆప‌సోపాలు ప‌డుతోంది. త‌న స్టార్ డ‌మ్‌, ఇమేజ్, సీనియారిటీకి త‌గిన పాత్ర‌ల కోసం అన్వేషిస్తోంది. కొంత‌మంది ద‌ర్శ‌కులు కాజ‌ల్ ముదిరిపోయిందిలే.. అని లైట్ తీసుకుంటుంటే, ఇంకొంత‌మంది నిర్మాత‌లు `మా బ‌డ్జెట్‌కి కాజ‌ల్ సూట‌వ్వ‌దు` అని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కాజ‌ల్‌కి ఓ మంచి అవ‌కాశం త‌లుపు త‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

 

కాజ‌ల్ క‌థానాయిక‌గా సురేష్ ప్రొడ‌క్ష‌న్ ఓ చిత్రాన్ని నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇది ఓ కొరియన్ సినిమాని రీమేక్ అని స‌మాచారం. ఇది వ‌ర‌కు స‌మంత‌తో `ఓ బేబీ`నిర్మించింది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. అది కొరియ‌న్ సినిమాకి రీమేకే. ఇప్పుడు కాజ‌ల్‌తో ప్లాన్ చేస్తోంద‌న్న‌మాట‌. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని టాక్‌. కాజ‌ల్ - న‌రేష్ అంటే... కాంబినేష‌న్ కొంచెం ఆడ్ గానే ఉంటుంది. మ‌రి.. ఈ కాంబో ఎలా కుదురుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS