పోయి పోయి నానితో పెట్టుకుంటాడేంటి?

మరిన్ని వార్తలు

పాపం..రాజ్ త‌రుణ్‌. త‌న ఖాతాలో ఓ హిట్టు ప‌డి ఎన్నాళ్ల‌య్యిందో..? చేసిన ప్ర‌తీ సినిమా ఫ‌ట్టు మంటుంది. రాజ్ త‌రుణ్‌తో సినిమా చేయించుకుని పారితోషికాలు ఎగ్గొడుతున్నారు. పైగా రాజ్ త‌రుణ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ కూడా ఏం బాలేదు. మొన్నామ‌ధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోనూ దొరికిపోయాడు. ఓ హిట్టు కొట్టి త‌న ప్ర‌తాపం చూపించుకోవాల‌ని తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. త‌న ఆశ‌ల‌న్నీ ఒరేయ్ బుజ్జిగా సినిమాపైనే ఉన్నాయి. విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌కత్వం వ‌హించిన చిత్ర‌మిది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ఓకే అనిపించుకుంది.

 

ఈ సినిమాని మార్చి 25న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆ రోజు ఉగాది. కాబ‌ట్టి.. తెలుగు ప్రేక్ష‌కులంతా హాలీడే మూడ్‌లో ఉంటారు. క‌ల‌క్ష‌న్లు బాగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే అదే రోజున నాని న‌టించిన `వీ` విడుద‌ల అవుతోంది. ఏబీసీ అంటూ సెంట‌ర్ల‌తో ప‌నిలేకుండా నానికి ఎక్క‌డైనా స‌రే, మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ సినిమా అది. పైగా మాస్‌ని ఆక‌ట్టుకోవ‌డానికి సుధీర్ బాబు కూడా ఉన్నాడు. నాని ఇప్పుడు ఓ స్టార్ హీరో. త‌న సినిమాతో పోటీ ప‌డడం నిజంగా సాహ‌స‌మే అవుతుంది. పైగా హిట్టుకోసం ప్రాకులాడుతున్న‌ప్పుడు విడుద‌ల తేదీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇప్పుడు త‌ప్పు చేస్తే... మ‌ళ్లీ తేరుకోవ‌డం క‌ష్టం. అయినా స‌రే, రాజ్ త‌రుణ్ 25న రావ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నాడు. మ‌రి ఈ పోటీ లో ఏం జ‌రుగుతుందో, గెలుపు ఎవ‌రిదో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS