పాప కాలం మారింది. ఒకప్పుడు హీరోయిన్స్‌కి పెళ్లయితే, కెరీర్ ఫుల్ స్టాప్ అయిపోయినట్లే. కానీ, ఇప్పుడలా కాదు, పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే, సమంత ఆ విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు కాజల్ వంతొచ్చింది. చందమామ కాజల్ అగర్వాల్ రీసెంట్గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు హనీమూన్.. హజ్బెండ్ అంటూ, ఫ్రెష్‌గా పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు కెరీర్ పైనా ఫోకస్ పెట్టింది.
పెళ్లికి ముందు కమిట్ అయిన ప్రాజెక్టులు కంప్లీట్ చేసేసి, పెళ్లి తర్వాత ఫ్రెష్‌గా సినిమాలకు సైన్ చేస్తోంది.ఆ క్రమంలోనే ఓ తమిళ సినిమాకి కాజల్ కమిట్ అయ్యిందట. ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ సమ్మర్ నుండి స్టార్ట్ కానుందట. మరోవైపు తెలుగులోనూ కాజల్‌కి అవకాశాలొస్తున్నాయట. ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' సినిమాలో నటిస్తోంది కాజల్. అలాగే ఆమె నటించిన 'మోసగాళ్లు' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మంచు విష్ణు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజా అప్డేట్ ప్రకారం, కాజల్ కెరీర్‌కి ఇప్పట్లో ఢోకా లేదనిపిస్తోంది. ఈ జోరులోనే డిఫరెంట్ మూవీస్‌పై సైన్ చేసేందుకు కాజల్ పావులు కదుపుతోందట. సో ఇన్నోవేటివ్‌గా ఆలోచించే అప్‌కమింగ్ రచయితలూ.. కాజల్ పాపను కాస్త దృష్టిలో పెట్టుకుని మీ కలానికి పదును పెట్టండిక.