ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ సినిమాకి డబుల్‌ గ్లామర్‌?

మరిన్ని వార్తలు

కొన్నాళ్లుగా త్రివిక్రమ్‌ సినిమాల్లో ఇద్దరిద్దరు హీరోయిన్స్‌తో డబుల్‌ గ్లామర్‌ అద్దడం ఆనవాయితీగా వస్తోంది. మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌తో పాటు, ఓ మోస్తరు రేంజ్‌లో అందాలారబోసేలా మరో హీరోయిన్‌ని తీసుకొస్తుంటాడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌. తాజాగా త్రివిక్రమ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు మీడియాలో పొక్కుతున్నాయి. వాళ్లెవరో కాదు, అందాల భామ పూజా హెగ్దే, క్రేజీ బ్యూటీ రష్మిక మండన్నా.

 

ఇంతవరకూ మెయిన్‌ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ ఉన్న ముద్దుగుమ్మని ఎంచుకోగా, సెకండ్‌ హీరోయిన్‌గా పెద్దగా స్టార్‌డమ్‌ లేని హీరోయిన్‌ని తీసుకునేవాడు. బట్‌ జస్ట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌.. ఇప్పుడు టాక్‌లో ఉన్న ఇద్దరు భామలూ స్టార్‌ హీరోయిన్లే. గ్లామర్‌లో పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆ మాటకొస్తే, రష్మికా కూడా ఏం తక్కువ కాదులెండి.. అయితే, ఓవర్‌ డోస్‌లో గ్లామర్‌ని రష్మిక నుండి ఎక్స్‌పెక్ట్‌ చేయచ్చో లేదో. కానీ, సినిమా సినిమాకీ రష్మిక తనను తాను మార్చుకుంటూ, సక్సెస్‌ పాఠాలు బాగా నేర్చుకుంటోంది.

 

అందులో భాగంగా ఈ సినిమా కోసం గ్లామర్‌ అవతారమెత్తినా ఎత్తేయొచ్చు. ఇకపోతే, ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లు కొడుతూ స్టార్‌ హీరోయిన్‌ చైర్‌కి గట్టి పోటీ ఇస్తోంది రష్మిక. ఆల్రెడీ పూజా హెగ్దే స్టార్‌ ఇమేజ్‌ దక్కించేసుకుంది. అనున్నట్లే అన్నీ సెట్టయితే, ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య కాంపిటేషన్‌ గట్టిగానే ఉండబోతోందనుకోవాలి. ఇక పూజా విషయానికి వస్తే, త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో అరవిందగా హండ్రెడ్‌ పర్సంట్‌ మార్కులేయించేసుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS