బాలీవుడ్‌లో కంగనా ప్రధాన పాత్రలో నటించిన 'క్వీన్'ని సౌత్ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ రీమేక్స్ ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఒక్కో భాషలో ఒక్కో ముద్దుగుమ్మ క్వీన్‌గా నటిస్తున్నారు. డిఫరెంట్ టైటిల్స్‌తో రూపొందుతోన్న ఈ క్వీన్, తమిళంలో కాజల్ హీరోయిన్‌గా 'ప్యారిస్ ప్యారిస్' టైటిల్‌తో రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ బోర్డు వరకూ చేరింది. ఇంకేముంది.. రేపో మాపో విడుదల కానుందని అనుకున్నారంతా.
ఇదిలా ఉంటే, సెన్సార్ బోర్ట్ కాజల్ క్వీన్‌పై విచ్చలవిడిగా కత్తెర దూసింది. చాలా సీన్స్ టపా టపా కట్ చేసి పారేసిందట. అయితే, టీజర్ టైంలోనే కాజల్ క్వీన్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్న మాట వాస్తవమే. కొన్ని బోల్డ్ సీన్లలో కాజల్‌ని చూడడం అభ్యంతరకరంగా అనిపించిందని ప్రేక్షకులు అప్పుడే వాపోయారు. అయితే, ఆ సీన్‌ని ఏదో ప్రమోషన్ కోసం వాడి ఉంటారులే.. అలాంటి సీన్‌లో కాజల్ ఎందుకు నటిస్తుందిలే.. అనుకున్నారు. కానీ తాజాగా సెన్సార్ ఇష్యూ బయటికొచ్చేసరికి, అసలు సంగతి బయటపడింది.
ఇలాంటి బోల్డ్ సీన్లు సినిమాలో చాలానే ఉండి ఉంటాయని ప్రేక్షకులు ఓ ఐడియాకొచ్చేశారు. అందుకే సెన్సార్ కత్తెరకు కాజల్ 'క్వీన్' బలైపోయిందని అర్ధమవుతోంది. అయితే, తాజాగా సెన్సార్ తీరుపై చందమామ అసహనం వ్యక్తం చేసింది. ఇతర భాషల్లో లేని అభ్యంతరాలు తమిళంలోనే ఎందుకొచ్చాయనీ, ఆ సీన్లు కట్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడింది. అసలింతకీ, ఆ కట్ చేసిన సీన్లు ఏమై ఉంటాయబ్బా? అని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ మొదలైపోయింది.