'సాహో'కి గ్లామర్‌ 'శ్రద్ధ' తగ్గిందే.!

మరిన్ని వార్తలు

మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'సాహో' ప్రమోషన్స్‌ భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. హీరో, హీరోయిన్‌, చిత్ర యూనిట్‌ ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు. నాలుగు భాషల్లో విడుదలవుతోన్న సినిమా కావడంతో, అన్ని చోట్లా ప్రమోట్‌ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో క్షణం కూడా తీరిక లేకుండా, చిత్ర యూనిట్‌ కష్టపడుతోంది.

 

ఇక హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ విషయానికి వస్తే, ప్రమోషన్స్‌లో పెద్దగా గ్లామర్‌ చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ హీరోయిన్‌ అంటే, ఆమె నుండి గ్లామర్‌ని టన్నుల కొద్దీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. లోకల్‌ బ్యూటీసే గ్లామర్‌ ఇరగదీసేస్తుంటే, ఇక బాలీవుడ్‌ పోరీ ఇంకెంత చేయాలి.? కానీ, శ్రద్ధాకపూర్‌ మాత్రం ఆఫ్‌ స్క్రీన్‌ చాలా డిగ్నిఫైడ్‌గా కనిపిస్తోంది. ప్రమోషన్స్‌లో ఎక్కడా హద్దులు మీరి డ్రెస్‌ చేసుకోవడం లేదు. డిగ్నిఫైడ్‌ కాస్ట్యూమ్స్‌లోనే దర్శనమిస్తోంది.

 

ఒక రకంగా ఆమె బాడీ లాంగ్వేజ్‌, డీసెంట్‌ డ్రస్‌ సెన్స్‌ ముచ్చటేసుకొస్తున్నా, మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో కొంచెం మిస్‌ మ్యాచ్‌ అవుతోంది. కానీ, సినిమాలో ఆమె వంతుగా గ్లామర్‌ పండించినట్లే కనిపిస్తోంది ప్రచార చిత్రాలను బట్టి. ఏది ఏమైనా, పాటల్లోనే తప్ప, సినిమాలో కూడా ఆమెది పర్‌ఫామెన్స్‌కి స్కోపున్న రోలే. అందుకే ఆ లోటు కవర్‌ చేసేందుకే 'బ్యాడ్‌ బోయ్‌' సాంగ్‌తో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చి, మాస్‌కి హింట్‌ ఇచ్చారు 'సాహో' టీమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS