'రణరంగం'లో కాజల్‌: అంత సీన్‌ లేదట!

మరిన్ని వార్తలు

ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రం 'రణరంగం'లో కాజల్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ చాలా తక్కువ నిడివితో కూడుకున్నదని కాజల్‌ అగర్వాల్‌ చెబుతోంది. నిడివి తక్కువ అయినా, ఆ పాత్ర అందరికీ గుర్తుండిపోతుందనీ అంటోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కళ్యాణీ ప్రియదర్శిన్‌ నటిస్తోంది. కాజల్‌ చెబుతున్న మాటల ప్రకారం 'రణరంగం'లో కళ్యాణీనే మెయిన్‌ హీరోయిన్‌ అన్నమాట. అయితే, కథ, దర్శకుడు తనకు కథ చెప్పిన తీరు, తన పాత్ర తాలూకు గొప్పతం అన్నీ మెచ్చి ఈ సినిమాలో నటించేందుకు ఇష్టపడ్డానని కాజల్‌ చెబుతోంది.

 

సినిమా చూశాక, ఫ్యాన్స్‌ నిరాశ పడకూడదనే, తన పాత్ర నిడివి గురించి ముందుగానే అభిమానులకు తెలియపరుస్తున్నానని చందమామ చెప్పుకొచ్చింది. మరోవైపు కాజల్‌ అగర్వాల్‌ తమిళంలో విశ్వనటుడు కమల్‌హాసన్‌తో 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కాజల్‌ తప్పుకుందంటూ ఈ మధ్య గాలి వార్తలు వినిపించాయి.

 

ఈ విషయంలోనూ కాజల్‌ ఫుల్‌గా క్లారిటీ ఇచ్చేసింది. నన్ను నిజంగా అభిమానించే వాళ్లు ఇలాంటి గాలి వార్తల్ని అస్సలు నమ్మవద్దనీ, ఏది ఏమైనా ఈ సినిమాని వదులుకొనే ప్రశక్తే లేదనీ, తేల్చి చెప్పింది. ఇటీవలే సెట్స్‌ మీదికెళ్లిన ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్దార్ద్‌ ఇతర కీలక పాత్ర ధారులు. లైకా ప్రొడక్షన్స బ్యానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది 'ఇండియన్‌ 2'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాకి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS