వరలక్ష్మీ శరత్ కుమార్.. పరిచయం అక్కర్లేని పేరిది. 'పందెం కోడి 2' తదితర చిత్రాల్లో లేడీ విలన్‌గా నటించి మెప్పించింది. ఒకప్పుడు హీరోయిన్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్, విశాల్‌తో లవ్ ఫెయిల్యూర్ అయ్యాకా, విలన్ క్యారెక్టర్స్‌కి సై అంటోంది. విలన్ క్యారెక్టర్లే కాదు, పవర్ ఫుల్ లేడీ రోల్స్‌లోనూ నటించి మెప్పిస్తోంది. 'మారి 2' తదితర చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
తమిళంలో ఆమె విలనిజం చూశాక, తెలుగులో కూడా వరలక్ష్మికి మంచి అవకాశాలు వస్తున్నాయి. సందీప్ కిషన్, హన్సిక జంటగా నటిస్తున్న 'తెనాలి రామకృష్ణ బిఎబిఎల్' చిత్రంలో వరలక్ష్మి లేడీ విలన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఆమె హీరోయిన్‌గా నటించిన 'కాన్ని రాశి' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విమల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ముత్తు కుమారన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, వరలక్ష్మి తన పెళ్లి గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు ముచ్చటించారు.
ప్రేమ పెళ్లి చేసుకుంటారా.? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? అని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు, తాను అసలు పెళ్లే చేసుకోనని సమాధానమిచ్చింది. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనకు లేదని వరలక్ష్మి సూటిగా ఇచ్చిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. అనడం హీరోయిన్స్‌కి సహజమే. కానీ, అసలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదనడం విస్మయపరిచే అంశమే.