గురువారం విడుదలైన సినిమాల్లో `రణరంగం` ఒకటి. శర్వానంద్‌కి జోడీగా కాజల్, కల్యాణి ప్రియదర్శి నటించారు. నిజానికి కల్యాణితో పోలిస్తే కాజల్ పెద్ద స్టార్. ప్రధాన కథానాయిక పాత్ర కాజల్‌కే దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ వెండి తెరపై `రణరంగం` చూసి అందరూ షాక్ అయ్యారు. కాజల్ కంటే.. కల్యాణి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. కాజల్‌ని హీరోయిన్ అనడం కంటే, అతిధి పాత్ర అనుకోవడం బెటర్. కాజల్‌పై తెరకెక్కించిన ఒకే ఒక్క పాటని కూడా ఎండ్ కార్డ్స్‌లో వాడుకున్నారు.
అసలు ఈ పాత్రలో నటించడానికి కాజల్ ఎలా ఒప్పుకుంది? ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రలో కాజల్‌ని ఎందుకు తీసుకున్నారు? అంటూ విమర్శలు వినిపించడం మొదలయ్యాయి. నిజానికి కాజల్ పాత్రకీ చాలా ప్రాధాన్యం ఉందట. కాజల్‌పై తెరకెక్కించిన చాలా సన్నివేశాలు ఎడిటింగ్ రూమ్ లో కత్తెర్లకు బలయ్యాయట. ఈ విషయాన్ని హీరో శర్వానంద్ స్వయంగా ఒప్పుకున్నాడు. కాజల్ పాత్రతో ముడిపడిన కొన్ని సన్నివేశాల్ని లెంగ్త్ సమస్య వల్ల కుదించాల్సివచ్చిందని ఒప్పుకున్నాడు శర్వా.
కాజల్ పై తెరకెక్కించిన పాటని ముందే వాడుకోవాలని చూశార్ట. కానీ. చివర్లో ఎండ్ కార్డ్స్‌లో వాడుకోవాల్సివచ్చింది. సినిమా హిట్టయితే కాజల్ నటించిన సన్నివేశాల్ని మళ్లీ జోడించాలనుకున్నారు. డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఆ సాహసం చేయకపోవచ్చు. ఈ సినిమా చూసి కాజల్ కూడా నిరుత్సాహానికి గురి కావడం ఖాయం. అంతలా ఆమె సన్నివేశాలకు కోత పడింది మరి.