మెగాహీరో రిస్క్‌ చేస్తున్నాడా?

మరిన్ని వార్తలు

'ప్రస్థానం' వంటి క్రిటికల్‌ సబ్జెక్ట్‌ మూవీని తెరకెక్కించిన దర్శకుడు దేవ్‌ కట్టా గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఆ తర్వాత ఆయన నాగచైతన్యతో 'ఆటో నగర్‌ సూర్య' సినిమా తెరకెక్కించాడు. కానీ ఆశించిన విజయం సాధించలేకపోయాడు. తాజాగా ఈయనతో పని చేసేందుకు ఓ మెగా హీరో ముందుకొచ్చాడనీ తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సాయి ధరమ్‌ తేజ్‌, దేవ్‌ కట్టా కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందట.

 

అయితే, తేజుకి ఈ కాంబో వర్కవుట్‌ అవుతుందా.? దర్శకుడు విషయమున్నోడో. కానీ, ఆయనలోని విషయం నేటి జనరేషన్‌ సినీ ప్రియుల్ని మెప్పిస్తుందా.? వంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత, వరస ఫెయిల్యూర్స్‌ తర్వాత ఈ మధ్యనే కెరీర్‌ని గాడిన పెట్టిన తేజు ఈ తరుణంలో రిస్క్‌ చేయడం అవసరమా.? అని ఆయన ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఏమో ఈ కాంబోపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.

 

'చిత్రలహరి' సినిమాతో హిట్‌ కొట్టిన సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం మారుతితో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 'ప్రతీ రోజూ పండగే' అనే ఆహ్లాదమైన టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS